చూస్తుండగానే గుడి కొట్టుకుపోయింది - temple
వరద ఉద్ధృతికి ఓ గుడి చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయింది. విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా.... వరాహ నది ఉధృతికి ఎస్ రాయవరం మండలం, సోము దేవుపల్లిలో నూకాలమ్మ గుడి కొట్టుకుపోయింది. నది ఒడ్డున ఉన్న గుడి క్రమంగా కోతకు గురై నీటిపాలైంది. ప్రజలంతా చూస్తుండగానే దేవాలయం నీటిలో కలిసిపోయిన దృశ్యాలు స్థానికులను ఆవేదనకు గురిచేశాయి.