Srisailam Dam: నిండుకుండలా శ్రీశైలం.. గేట్లు ఎత్తి నీటి విడుదల - శ్రీశైలంలో గేట్లు ఎత్తిన మంత్రి అంబటి రాంబాబు
Srisailam Gates Open: కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు తొలుత 6వ నెంబర్ గేటు ఎత్తి 27వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. అనంతరం 7, 8 గేట్లను సైతం 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే మంత్రి వెళ్లిపోగానే 7,8 గేట్లను మూసివేశారు. కేవలం 6 నెంబర్ గేటు ద్వారానే నీళ్లు దిగువకు వదులుతున్నారు.
Last Updated : Jul 23, 2022, 1:37 PM IST