శివయ్యకు అభిషేకం.. పులకించిన భక్తజనం - sivaratri celebrations in amadalavalasa
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళంలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీముఖలింగం ఆలయాల్లో ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. శ్రీముఖలింగం ఆలయంలో ఎంపీ రామ్మోహన్నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. ఆమదాలవలసలోని సరుబుజ్జిలి, పొందూరు మండలాల్లో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాగరణ సందర్భంగా ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
TAGGED:
sivaratri celebrations