సంక్రాంతి వేళ.. గంగిరెద్దుల సందడే వేరు
తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళతో.. బంధు మిత్రులతో కళకళలాడుతుంటాయి. ఇలాంటి సమయంలో.. పండుగకు మరింత అందాన్ని తీసుకొచ్చేది గంగిరెద్దుల సందడి. అయ్యగారికీ దండం పెట్టు.. అమ్మగారికి ప్రణామం చేయి అంటూ గంగిరెద్దులతో జానపద కళాకారులు సందడి చేస్తారు. అనాదిగా ఈ సంప్రదాయం తెలుగు నేలపై సజీవంగా ఉంది.