అందరి గుండెల నిండా.. ఆనందం నింపిన జెండా - తూర్పుగోదావరిలో జెండా పండుగ వార్తలు
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం, కొత్తపేటలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కాకినాడలోని పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా పాలనాధికారి మురళీధర్ రెడ్డి జెండా వందనం చేసి ప్రసంగించారు. యానాంలో జరిగిన వేడుకలు ఆకట్టుకున్నాయి.