ప్రతిధ్వని: ఇళ్లు, స్థలాల కొనుగోలుదారుల హక్కులకు రక్షణ ఉందా? - prathidwani latest updates
ఇల్లు కట్టిచూడు, పెళ్లిచేసి చూడు... ఇవి సొంతింటి బాటలో ఎదురయ్యే కష్టనష్టాల గురించి పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్న మాటలు. అయితే సామాన్యుల సొంతింటి కలే ఇప్పుడు అక్రమార్కులకు బంగారు బాతుగా మారింది. నిర్మాణరంగంలో పెడ పోకడలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. వెంచర్లకు అనుమతులు రాకముందే ప్రీ లాంచింగ్, యూడీఎస్ రిజిస్ట్రేషన్లంటూ కొనుగోలుదారులకు వల విసురుతున్నారు. కలల సౌధాలంటూ కల్లిబొల్లి కబుర్లు చెబుతున్న బిల్డర్లు... గజాలు, ఫీట్ల చొప్పున ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అవిభాజ్య స్థలాలపై ఆదాయం పేరుతో కొనుగోలుదారులను ఊహల పల్లకీ ఎక్కిస్తున్న రియల్ దందాలపై ప్రతిధ్వని చర్చ.