సముద్ర తీరానికి అరుదైన చేప.. 3 టన్నుల బరువు! - సముద్ర తీరంలో అరుదైన చేప
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సూర్యారావుపేటలోని.. ఎన్టీఆర్ బీచ్ తీరానికి అరుదైన బుక్క సర్రా చేప కొట్టుకొచ్చింది. ఇది మత్స్యకారుల వలకు చిక్కి చనిపోయినట్లు తెలుస్తోంది. సుమారు 25 అడుగుల పొడవు.. 3 టన్నుల వరకు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేప పూర్తిగా శాకాహారి అని.. సముద్రంలో ఉండే నాచు మాత్రమే తింటుందని తెలిపారు.