కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే రక్ష: పల్మనాలజిస్ట్ సాయికృష్ణ - Pulmonalogist Saikrihna told On Corna
కరోనా వైరస్ వ్యాప్తిని రెండో దశలోనే అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖ శ్వాసకోశ వ్యాధి నిపుణుడు డాక్టర్ సాయికృష్ణ అభిప్రాయపడ్డారు. వ్యాధిపై ప్రజల్లో ఇప్పటికే అవగాహన పెరిగిందని...ఈ దశలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలందరూ చైతన్యవంతంగా.... సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరి ఇళ్లలో వారుండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, మాస్కులు ధరించి... భౌతికదూరం పాటిస్తే వైరస్ను నియంత్రించడం సాధ్యమేనంటున్న గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పల్మనాలజిస్టు డాక్టర్ సాయికృష్ణతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.