'బాలు'డి క్షేమం కోసం.. అభిమాని స్వరాభిషేకం! - S.P బాలసుబ్రహ్మణ్యం వార్తలు
ఆయన గొంతు అలుపెరుగని జలపాతం.. 50 యేళ్లుగా ఆయన స్వర ప్రస్థానం ఏనాడూ మూగబోలేదు. ఇటీవలే కరోనా బారినపడి చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. ఆయన బాటలోనే నడిచారు ఆయన అభిమాని, పలు చిత్రాలకు స్వరం, నేపథ్య సంగీతం అందించిన గాయకుడు, సంగీతదర్శకుడు రవివర్మ. " ఆయన మాకు మార్గనిర్దేశం చేసే గురువు..గంధర్వులను కరోనాలాంటి రక్కసులేమీ చేయలేవంటూ" బాలు త్వరగా కోలుకోవాలని తమ ప్రార్థనలను పాట ద్వారా వ్యక్తపరిచారు.