అధికవడ్డీరేట్ల వద్ద రుణాల్ని ఎంతమంది భరించగలరు..
వడ్డీ భారాలు మోసేది ఎలా? శుక్రవారం ఆర్బీఐ పరపతి విధానం సమీక్ష తర్వాత అందరిలో మొదలైన ప్రశ్న ఇదే. వరసగా 4వ సారీ రెపోరేటు పెంపుదలకే మొగ్గు చూపిన కేంద్రబ్యాంకు కొద్దిరోజులుగా అంతా ఊహించినట్లుగానే... 50 బేసిస్ పాయింట్లు వడ్డించింది. దీంతో మొత్తం 1.9% వరకు కీలక వడ్డీరేట్లు పెరిగినట్లయింది. ద్రవ్యోల్బణం కట్టడి, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం అని చెబుతున్నా.. దేశంలోని సామాన్య, మధ్యతరగతి వర్గాలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది? ఇంకా ఎంతకాలం ఇదే కఠిన వైఖరి ఉంటుంది? రుణమార్కెట్‌పై ఈ వైఖరి వల్ల ప్రజలు, పారిశ్రామిక రంగం ఎదుర్కొనే ఇబ్బందుల మాటేమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Oct 1, 2022, 9:21 PM IST