ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Pratidhwani: నెల్లూరు కోర్టులో చోరీ ఘటన.. ఎవరికి సంబంధం? ఎవరికి అవసరం? - Pratidhwani over nellore court incident

By

Published : Apr 18, 2022, 10:42 PM IST

రాష్ట్రంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌.. నెల్లూరు కోర్టులో చోరీ ఘటన. ఇనుము కోసం వెళ్లి కోర్టులో దొంగతనం చేశారంటున్నారు పోలీసులు! అసలు వాళ్లు నిజమైన దొంగలేనా అంటున్నారు.. పౌరసమాజం ప్రతినిధులు. కోర్టులో చోరీని న్యాయవ్యవస్థపై దాడిగానే చూడాలి అంటున్నాయి న్యాయవాద వర్గాలు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్థన్‌ రెడ్డి.. ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు. అది కూడా మరికొద్దిరోజుల్లో విజయవాడ ప్రత్యేకకోర్టుకు బదిలీ కావాల్సి ఉన్న తరుణంలో కీలకపత్రాలు, ఆధారాలు చోరీ కావడంతో.. విపక్షాల నుంచీ తీవ్ర విమర్శలే వస్తున్నాయి. న్యాయాన్ని బతికించాల్సిన సాక్ష్యాధారాలకు ఆ న్యాయస్థానంలో రక్షణ కరవైతే ఈ కేసును ఎలా చూడాలి? దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details