Pratidhwani: ఎరువుల బరువు మోసేదెలా..? రాయితీలపై ప్రభుత్వ నిర్ణయమేంటి..? - ప్రతిధ్వని కార్యక్రమం
Pratidhwani: ఎరువుల బరువు మోసేదెలా? కారణాలేవైనా ఏటికేటా భారం పెరుగుతూనే ఉంది. మన వద్ద అధికంగా ఉపయోగించే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులకు ఇది మరీ శరాఘాతం అవుతోంది. కేంద్రప్రభుత్వం రాయితీ మొత్తాల్ని భారీగా పెంచామని చెబుతున్నా.. అన్నదాతలకు ఊరట లభించడం లేదు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు అలానే కొనసాగుతున్న వేళ.. రానున్న రోజుల్లో అది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? కొద్ది రోజుల్లోనే సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఎరువుల ధరలు, రాయితీలపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మేలు ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.