ధరలపై ప్రభుత్వాలు చేతులెత్తేస్తే.. సామాన్యులు బతికేదెలా? - ప్రతిధ్వని కార్యక్రమం
పెట్రోల్, డీజిల్ నుంచి వంటనూనెల వరకు ధరలు చుక్కలనంటుతున్నాయి. ముడి సరకుల ధరలు, రవాణా, హోల్సేల్ ఛార్జీలు వీటికి తోడవడంతో సామాన్యుల కొనుగోలు శక్తి కుదేలవుతోంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు చితికిపోతున్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యమే మందగిస్తోంది. ఈ పరిస్థితుల్లో రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్న నిత్యవసరాల ధరలను అదుపు చేసే బాధ్యత ఎవరిది? అంతర్జాతీయ చమురు ధరలపై భారంవేసి, ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉంటే సామాన్యులు బతికేదెలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.