ప్రతిధ్వని: లక్షకోట్ల మౌలిక వసతుల నిధి అన్నదాతకు అండగా ఉండనుందా..?
దేశంలో అన్నదాతకు అండగా ఉండేందుకు లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ, మౌలిక వసతుల నిధిని ప్రధాని మోదీ ప్రారంభించారు. గ్రామాల్లో రైతులు, శీతల గిడ్డంగులు, గోదాములు ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగం పరిశ్రమలు, రైతు సంఘాలు, అంకురాలకు ఆర్థిక ఊతాన్నిస్తుంది. రైతులే పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. లక్ష కోట్ల రూపాయల మౌలిక వసతుల నిధి అన్నదాతకు ఎంత ఆసరాగా నిలువనుంది? వ్యవసాయ, మౌలిక సదుపాయాల్లో ఎలాంటి కీలక మార్పులను తీసుకురానున్నారు అనే అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ