ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: తుక్కు విధానం, హరితపన్నుతో కొత్త కలవరం - ప్రతిధ్వని

By

Published : Feb 5, 2021, 9:55 PM IST

చాలా కాలంగా ప్రతిపాదనల్లో ఉన్న స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టాలెక్కించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీనిని అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ చెప్పారు. ఇది అమలులోకి వస్తే.. 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు.. ఇక నుంచి తుక్కుగా మారాల్సిందే. అలాగే 8 ఏళ్లు దాటిన దగ్గర నుంచి వాణిజ్య వాహనాలపై హరితపన్ను కూడా విధించబోతున్నారు. ఈ విధానం ద్వారా ఆటోమెబైల్ రంగం పురోగమిస్తుందనేది కేంద్రం ఆలోచన. అయితే ఇప్పటికే తీవ్రనష్టాల్లో ఉన్నటువంటి వాణిజ్య, రవాణా రంగం మరింత దెబ్బతింటుందనేది ఆ రంగానికి చెందిన వారి ఆందోళన. అయితే పర్యావరణ కోణంలో చూసినప్పుడు దీనిని అమలు చేయాలని మరికొందరి సూచన. ఈ అంశంపై భిన్నమైన వాదనలు ఉన్న తరుణంలో దీనిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details