ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: బంతి బంతికి బెట్టింగ్.. రోడ్డున పడుతున్న కుటుంబాలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

By

Published : Apr 14, 2021, 9:24 PM IST

ఐపీఎల్‌తో దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. దాంతోపాటే బెట్టింగ్ చీడ కూడా వాడవాడలా విస్తరిస్తోంది. ఉచ్చులో చిక్కుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఊరంతా అప్పులు. హత్యలు, ఆత్మహత్యలు, హవాలా లింకులు.. ఇలా అనేక రూపాల్లో బెట్టింగ్ మాఫియా పర్యావసనాలు కలవరపెడుతున్నాయి. మొత్తం మ్యాచ్‌ ఫలితంపైనే కాదు.. బాల్​బాల్​కి బెట్టింగ్. పరుగు పరుగుకి.. బెట్టింగ్. క్యాచ్‌లపై బెట్టింగ్. ట్రెండ్‌లపై బెట్టింగ్. గంటల వ్యవధిలో వేలు, లక్షలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అంతేవేగంగా జీవితాలు తలకిందులు అవుతున్నాయి. రాత్రికిరాత్రి రాత మారడం దేవుడెరుగు.. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ దుస్థితికి అంతెక్కడ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చ.

ABOUT THE AUTHOR

...view details