Prathidwani: పదో తరగతి ఉత్తీర్ణత తగ్గడానికి కొవిడ్ ఒక్కటే కారణమా ?
రాష్ట్రంలో విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం..ఊహించని రీతిలో తగ్గింది. రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. అంతేకాక ర్యాంకులపై ప్రచారాన్ని నిషేధించిన ప్రభుత్వం.. తిరిగి విద్యార్థుల మార్కులు ప్రకటించే విధానాన్ని తిరిగి తీసుకుని వచ్చింది. కాకపోతే మొత్తం మీద ఉత్తీర్ణత 67.26శాతానికే పరిమితమైంది. ప్రకాశం జిల్లా అత్యధికంగా 78.30%తో ప్రథమస్థానంలో.. అనంతపురం జిల్లా 49.70శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. కొవిడ్ అనంతరం నిర్వహించిన ఈ ప్రత్యక్ష ఫలితాల్లో ఉపాధ్యాయులు, ప్రభుత్వం, తల్లిదండ్రులు గమనించాల్సిన అంశాలు ప్రమాణాల విషయంలో చేపట్టాల్సిన దిద్దుబాటు ఏమిటి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.