ఆర్థిక పరిస్థితి బాగుంటే రాష్ట్రంలో ఇన్ని కష్టాలెందుకో - debate on state debits
అంతా బాగుంటే ఇన్ని కష్టాలు ఎందుకో? రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి ఢోకా లేదంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన తర్వాత ప్రధాన వినిపిస్తోన్న ప్రశ్న ఇదే. రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ సరిగా లేదని కాగ్ మొదలు రేటింగ్ సంస్థల వరకు ఘోష పెడుతున్న తరుణంలో ఏకంగా ముఖ్యమంత్రే ఇలా ప్రకటన చేయడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన అన్నట్లు ఏ సమస్య లేకుంటే పింఛనర్లకు డీఏ బకాయిలెందుకు? ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు ఎలా పేరుకుపోయాయి? పనులు చేసేందుకు గుత్తేదారులు ఎందుకు ముందుకు రావడం లేదు? ఏపీకి అప్పులు ఇచ్చిన తీరు తప్పని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చెప్పలేదా? అంతేకాదు... అంత నమ్మకం ఉంటే మూడేళ్లలో చేసిన అప్పులపై శ్వేతపత్రం ఎందుకు ప్రకటించలేక పోతున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.