ప్రభుత్వ అప్పుల లెక్కల విన్యాసాలు.. ఆందోళనలో ఉద్యోగులు - etv bharat pd on employees gpf founds transfer
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండానే వారి జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ముు గల్లంతు అయింది. డీఏ, ఏరియర్స్ బకాయిల నిధులను సమాచారం ఇవ్వకుండానే వారి ఖాతాల నుంచి వెనక్కి తీసుకున్నారు. ఉన్నట్టుండి డబ్బులు విత్ డ్రా అయినట్లు ఎస్‌ఎంఎస్‌లు రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఖాతాల్లో సొమ్ములు ఖాళీ కావడంపై అధికారులను నిలదీస్తే సమస్య ఎక్కడుందో విచారణ చేస్తున్నామంటూ సమాధానం వస్తోంది. అసలు ఆర్థిక సంవత్సరం చివరలో పీడీ ఖాతాల్లో నిధులు ఎందుకు ఖాళీ అవుతున్నాయి?. ప్రభుత్వ అప్పుల లెక్కల విన్యాసంలో ఉద్యోగుల్ని ఆందోళనకు గురిచేస్తున్నది ఎవరు? ఈ వ్యవహారంలో ఉద్యోగులకు జరుగుతున్న నష్టం ఏంటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.