ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

PRATHIDWANI మతం మారితే రిజర్వేషన్లు కోల్పోవాలా దళిత క్రైస్తవులకు కోటా అమలు సాధ్యమేనా

By

Published : Oct 7, 2022, 10:16 PM IST

PRATHIDWANI దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. క్రైస్తవం లేదా ముస్లింలోకి మతం మారితే రిజర్వేషన్ల ఫలాలు కోల్పోవాలా? దేశంలో దశాబ్దాలుగా జరుగుతోన్న చర్చ ఇది. ఇదే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఎన్నో కేసులు దాఖలయ్యాయి. ఈ ఆగస్టు నెలలోనే షెడ్యూల్డ్‌ కులాల వారు అనుభవిస్తున్న రిజర్వేషన్‌ సౌకర్యాలను ఇతర మతాలకు చెందిన దళిత సభ్యులకూ విస్తరించవచ్చా? లేదా? అన్నదానిపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది సుప్రీం. ఈ పరిణామాలకు కొనసాగింపుగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పనపై అధ్యయనానికి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details