PRATHIDWANI: సైబర్ దాడిలో చిక్కుతున్న సహకార బ్యాంకులు.. రక్షణ ఎలా? - cybersecurity threats to banks
Bank's Cyber Security: సైబర్ నేరగాళ్లు సహకార బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఖాతాల నిర్వహణ, నగదు లావాదేవీల్లో లోపాలను గుర్తిస్తున్న సైబర్ కేటగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. వ్యక్తిగత ఖాతాలను పక్కన పెట్టి ఏకంగా బ్యాంకు సర్వర్లనే టార్గెట్ చేసి నగదు నిల్వలు లూటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో సామాన్యులు దాచుకున్న డబ్బుకు రక్షణ ఉందా? సైబర్ దాడుల్లో ఖాతాదారులు కోల్పోయిన సొమ్ములు తిరిగి రాబట్టేందుకు అవకాశం ఉందా? బరి తెగించి దాడులు చేస్తున్న హ్యాకర్ల నుంచి బ్యాంకులకు రక్షణ ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.