ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: బిహార్​ ఎన్నికలు... పార్టీల పొత్తులు - బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020 వార్తలు

By

Published : Sep 16, 2020, 10:19 PM IST

ఉత్తరాదిన కీలక రాష్ట్రమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఎన్నికల పొత్తులు, రాజకీయ ఎత్తుగడలకు తెరలేచింది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఆర్జేడీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. బిహార్​ను తాను ప్రగతి బాట పట్టించానని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ప్రచారంలో చాటుకుంటున్నారు. మరోవైపు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ.... ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతోంది. కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా మాహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. యశ్వంత్ సిన్హా సైతం 16 చిన్న పార్టీలతో కలిసి ఐక్య ప్రజాస్వామ్య కూటమి ఏర్పాటు చేశారు. వామపక్షాలు కూడా తామేమీ తక్కువ కాదంటున్నాయి. ఈ క్రమంలో బిహార్ ఎన్నికల సమరం... పార్టీల పొత్తులపై ప్రతిధ్వని చర్చ..

ABOUT THE AUTHOR

...view details