ప్రతిధ్వని: బ్యాంకులకు ఎన్పీఏల ముప్పు.. ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన చర్యలు - prathidwani debate on bank npas and measures to taken for economic growth news
బ్యాంకింగ్ కార్పొరేట్ సంస్థల రుణాలు మొండి బకాయిలుగా మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా అధ్యయనంలో పేర్కొంది. రుణ పునర్వ్యవస్థీకరణ చేయని పక్షంలో ఎన్పీఏలు 3 లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చని అంచనా వేసింది. రిజర్వు బ్యాంకు ప్రకటించిన రుణ పునర్వ్యవస్థీకరణ బ్యాంకింగ్ రంగానికి కొంతవరకు మేలు చేస్తుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నిరర్థక ఆస్తులను ఇంకా ఎలా తగ్గించవచ్చు.. మొండి బకాయిలను నిరోధించి ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి.. వాటి పరిష్కారాలేమిటి అన్న అంశాలపై ప్రతిధ్వని చర్చ..!