prathidwani: అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలు ఎటు దారి తీస్తాయి? - debate on Afghanistan situations
ఉగ్రవాద తండాలకు వెన్నుదన్నుగా నిలిచిన తాలిబన్ల చేతులకే అఫ్గానిస్థాన్ మళ్లీ చిక్కింది. ఇరవై ఏళ్లు అమెరికా కనుసన్నల్లో నెట్టుకొచ్చిన అఫ్గాన్ ప్రజా ప్రభుత్వం చేతులెత్తేసింది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పలాయనంతో తాలిబన్లు ఏకపక్ష విజయం సాధించారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం సరిహద్దులు దాటేందుకు నరకం చవిచూస్తున్నారు. ప్రపంచం గుండెల్లో ఉగ్రబాంబులై పేలిన తాలిబన్ చరిత్రను తలుచుకుని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడుతోంది. ఈ పరిస్థితుల్లో అఫ్గానిస్థాన్ పొరుగు దేశంగా భారత్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దౌత్యం, సైన్యం, రాజకీయంగా ఎలాంటి అప్రమత్తత అవసరం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.