ప్రతిధ్వని: జమిలి ఎన్నికలతో లాభమా? నష్టమా?
దేశంలో జమిలి ఎన్నికల ప్రతిపాదనలపై మరోసారి చర్చకు తెరలేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదనలు అనేక సందర్భాల్లో ముందుకొచ్చినా.. అప్పటి రాజకీయ ప్రాధాన్యాల నేపథ్యంలో వెనక్కెళ్లిపోయాయి. రెండేళ్లుగా మళ్లీ జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం తరచూ చర్చను లేవదీస్తోంది. మితిమీరుతున్న ఎన్నికల ఖర్చు, నల్లధనం, అవినీతి, అభివృద్ధికి అవరోధం వంటి కారణాలు చూపిస్తూ.. ఈసారి జమిలి ఎన్నికల ప్రతిపాదనలకు బలం కూడగట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. అసలు భారతదేశానికి జమిలి ఎన్నికలతో ప్రయోజనాలేంటి? లాభనష్టాలేంటనే అంశంపై ప్రతిధ్వని చర్చ..