మనసును కట్టిపడేసిన చిత్రకళా ప్రదర్శన - అమలాపురంలో చిత్రకళ ప్రదర్శన
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిత్రకారులు గీసిన చిత్రాలు... ఔరా అనిపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ చిత్రకళా పరిషత్ 30వ వార్షికోత్సవం సందర్భంగా అమలాపురంలో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు మనసును కట్టిపడేసే విధంగా ఉన్నాయి. మొత్తం 360 మంది చిత్రకారులు వివిధ చిత్రాలు గీయగా... వాటిలో 160 చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, దిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు గీసిన చిత్రాలు పోటీలో ఉంచారు.