కరోనా వైరస్ భిన్నమైనది.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
ఇప్పటివరకూ మానవాళిని సవాలు చేసిన వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ భిన్నమైనదని వైద్యనిపుణులు అంటున్నారు. ఏ వైరస్ కొత్తగా వచ్చినా తొలినాళ్లలో సహజంగానే భయం ఉంటుందని... స్వీయనిర్బంధం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి జాగ్రత్తలు పాటించటం ద్వారా... వైరస్ వ్యాప్తి చెందకుండా చూడొచ్చని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న గుంటూరు సర్వజనాస్పత్రి జనరల్ మెడిసిన్ వైద్యనిపుణుడు ఆదిశేషుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
Last Updated : Apr 1, 2020, 6:12 PM IST