ముద్దుగుమ్మల అరచేతులపై... ముచ్చటైన గోరింటాకు - mehendi competition
ఆషాడ మాసమంటేనే మహిళల అరచేతిలో గోరింటాకు ఉండాల్సిందే. చిన్నారుల నుంచి పెళ్లి కాని యువతులు, పెద్దవాళ్లు సైతం ఆషాడంలో కచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింట ఎంత బాగా పండితే వైవాహిక జీవితం అంత బాగుంటుందనేది పెద్దవాళ్లు చెప్పినమాట.ఈ గోరింటాకు ప్రాముఖ్యత అంత గొప్పది కాబట్టే... 'గోరింట పూచింది కొమ్మలేకుండా' అంటూ వెండితెరపై పాట పాడించారు. రోజులు మారుతున్నా... ట్యాటూల మోజు పెరుగుతున్నా... సాంప్రదాయ గోరింటాకుకు ఉన్న ఆదరణే వేరు. అందుకే కోమలమైన మగువుల చేతులపై ఎర్రటి కాంతులు వెదజల్లే గోరింటాకు పోటీలను శ్రీదేవి సాంఘిక సంక్షేమ సంఘం వారు నిర్వహించారు.