తిరుమల బ్రహోత్సవాలు: సింహవాహనంపై శ్రీనివాసుడు - బ్రహోత్సవాలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు ఉదయం సింహవాహనంపై మలయప్పస్వామి దర్శనమిచ్చారు. సన్నిధి నుంచి తిరుచ్చీ వాహనంలో విమాన ప్రదక్షిణంగా కల్యాణమండపానికి చేరుకున్న శ్రీవారు... అభయ ఆహ్వాన నరసింహస్వామి అవతారంలో దర్శనమిచ్చారు. వజ్రవైడూర్యాలతో, పరిమళభరిత పూల మాలలతో సర్వాలంకారభూషితుడైన స్వామివారికి అర్చకులు కర్పూర హారతులు, నైవేద్యాలను సమర్పించారు. వాహన సేవ అనంతరం రంగనాయకుల మండపంలో ఆస్థానాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.