కరోనా నిర్బంధాలు.. గర్భిణికి అష్టకష్టాలు! - ఏపీ లాక్‌డౌన్ ఎఫెక్ట్
శ్రీకాకుళం జిల్లాలో హృదయ విధారక ఘటన జరిగింది. లాక్ డౌన్ కారణంగా నిండు గర్భిణి నరకయాతన అనుభవించింది. కొత్తూరు మండలం అల్తి గ్రామంలో సవర వాణిశ్రీ అనే మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి తరలించే మార్గం ఒడిశా భూభాగం అయిన కారణంగా.. అక్కడి అధికారులు లాక్ డౌన్ వేళ రాకపోకలు జరగకుండా రోడ్డును తవ్వించారు. చేసేది లేక డోలి సహాయంతో కొత్తూరు సామాజిక ఆసుపత్రికి తరలించారు.