కోటిపల్లిలో వైభవోపేతంగా దీపోత్సవం - Koti Dipalu at Kotipalli news
తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో సోమేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని మేళ తాళాల నడుమ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు పూజలు నిర్వహించారు. ఉపవాసం ఉండి, జాగారం చేసి... దీపారాధన చూస్తే పుణ్యఫలం లభిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం.