మంచుతెరల్లో...కోనసీమ అందాలు - konaseema weather updates
ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచే కోనసీమ అందాలు... మంచుతెరల్లో మరింత కనువిందు చేస్తున్నాయి. సహజంగా పచ్చని పైర్లతో కళకళలాడే కోనసీమ ప్రాంతం... మంచు దుప్పటి కప్పుకుంది. లేలేత సూర్యకిరణాలు మంచు తెరలను చీల్చుకుంటూ వస్తున్న దృశ్యాలు మదిని పులకింపజేస్తున్నాయి. ఉదయాన్నే ఆకాశానికేసి చూసిన వారి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించాయి.