విజయవాడలో వైభవంగా నగరోత్సవం - Shivratri celebrations news
శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడలో నగరోత్సవం వైభవంగా జరిగింది. ఆదిదంపతులు సర్వాభరణాలు ధరించి రథంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. దుర్గామల్లేశ్వర స్వామి, భ్రమరాంబ మల్లేశ్వరస్వామి, వసంత మల్లికార్జునస్వామి ఆలయాల నుంచి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చి కెనాల్‌రోడ్‌లోని రథంపై ఉంచారు. మహిళల కోలాటాలు, సంకీర్తనలు, భజనలు, పులివేషాలు, ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్య..... వినాయకుడి గుడి వరకు ఊరేగింపు సాగింది. అడుగడుగునా భక్తులు స్వామివారికి అఖండ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.