'మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం' - Horticulture Commissionar cheernijeeve Interview
రాష్ట్రంలోని ఉద్యాన రైతుల పంట దిగుబడులకు మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు.... ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంట ఉత్పత్తుల వాహనాల రవాణాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైతులు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు పాటిస్తూ... పంట ఉత్పత్తుల కోతకు కూలీలను వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. రైతులు ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 2 కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేస్తే సత్వర చర్యలు తీసుకుంటామని ఈటీవీ ముఖాముఖిలో పేర్కొన్నారు.