Balakrishna - Vasundhara Video: చీరాల బీచ్‌లో బాలయ్య సందడి.. టాప్ లెస్ జీప్‌లో సరదా రైడ్ - నందమూరి బాలకృష్ణ
Balakrishna - Vasundhara Video: నందమూరి బాలకృష్ణ.. తన కుటుంబ సభ్యులతో కలిసి చీరాల బీచ్‌లో సందడి చేశారు. గుర్రంపై స్వారీ చేస్తూ శనివారం అదరగొట్టిన బాలయ్య.. ఇవాళ టాప్ లెస్ జీప్‌లో తన భార్య వసుంధరను పక్కన కూర్చోపెట్టుకొని స్వయంగా జీపు నడిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో బీచ్‌లో కొద్దిసేపు సేదా తీరారు. ప్రకాశం జిల్లా కారంచేడులోని తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో బాలయ్య కుటుంబం పాల్గొన్న సంగతి తెలిసిందే..