నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షం - nallamala forest
ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం ప్రభావానికి తుమ్మలబైలు వద్ద రహదారిపై.... నీరు ప్రవహిస్తోంది. శ్రీశైలం వెళ్లే వాహనాలు ఉదయం గంటపాటు నిలిచిపోయాయి. కొత్తూరు సమీపంలోనూ కర్నూలుకు రాకపోకలు స్తంభించాయి. అర్దవీడు మండలంలోని రాళ్ళ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చాలా రోజుల తర్వాత వరద నీరు వస్తుండడంతో బస్సుల్లోంచి దిగి ప్రజలు ఫొటోలు దిగారు. బొల్లుపల్లె సమీపంలోని ఆసియా ఖండంలోనే రెండవ పెద్దదైన కంబం చెరువుకు నీరుచేరడం మొదలైంది.
Last Updated : Jun 25, 2019, 10:53 AM IST