కొత్త నీరు రాకతో.. రంగు మార్చిన గోదారమ్మ..
గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరానికి వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజి నుంచి వరద నీటిని వదులుతున్నారు. ఈ కారణంగా.. గౌతమి వశిష్ఠ, వైనతేయ గోదావరి నదీ పాయలలో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. వరద నీటితో పాటు రెండు రోజులుగా.. కురుస్తున్న వర్షాలతో కేంద్ర పాలిత ప్రాంతం యానంలో వద్ద ఉన్న గౌతమి గోదావరిలో నీలి రంగులో ఉన్న నీరు.. ముదురు గోధుమ వర్ణంలోకి మారింది. యానం బాలయోగి వారధి వద్ద ఆ దృశ్యాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి.