ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఈటీవీ మనందరి టీవీ : గణపతి సచ్చిదానంద స్వామీజీ - ఈటీవీ 25వ వార్షికోత్సవం

By

Published : Aug 27, 2020, 4:51 AM IST

ఈటీవీ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక గురువు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈటీవీ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీ 25 ఏండ్లు పూర్తి చేసుకుని... సిల్వర్‌ జూబ్లీ జరుపుకోవడం సంతోషకరమన్నారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని సకాలంలో అందించడంతో పాటు విలువలు విశ్వసనీయత కలిగిన ఛానల్‌గా ఈటీవీకి మంచి పేరుందన్నారు. విద్య, వైద్యం, సంగీతం, వినోదం, వంటి వివిధ కార్యక్రమాలతో పాటు మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈటీవీ ప్రారంభం నుంచి ప్రసారం చేస్తూనే ఉందన్నారు. మంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ... ప్రతిభను ప్రోత్సహిస్తూ ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్న ఈటీవీ వ్యవస్థాపకులైన రామోజీరావు, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. రాబోయే కాలంలో ఈ ఛానల్‌ మరింత అభివృద్ధి చెందాలని స్వామీజీ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details