ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నాగార్జునసాగర్ జలాశయం వద్ద పీవీ సింధు సందడి - నాగార్జున సాగర్ నేటి వార్తలు

By

Published : Sep 27, 2020, 5:31 PM IST

Updated : Sep 27, 2020, 6:58 PM IST

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వీ.సింధు నాగార్జునసాగర్ జలాశయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆట, సాధనతో నిరంతరం గడిపే సింధు.. సాగర్​ విహారానికి వచ్చారు. భారీ వర్షాలకు ఆనకట్ట గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్న నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రులు పీవీ రమణ, విజయతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులతో నాగార్జునసాగర్‌ వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా సింధుతో పాటు కుటుంబ సభ్యులంతా ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు. అంతకుముందు ఆనకట్ట వద్దకు చేరుకున్న సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు.
Last Updated : Sep 27, 2020, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details