ప్రతిధ్వని: చేయూతనందిస్తేనే చేనేత నిలిచేది..! - చేనేత రంగంపై ప్రతిధ్వని చర్చ
కరోనా సంక్షోభం వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయి. చేనేత రంగం మరింత నష్టపోయింది. పని చేస్తేనే పూట గడిచే నేతన్నల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అసలే ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై కరోనా.. పిడుగుపాటులా పడింది. చేనేత పరిశ్రమపై కరోనా ప్రభావం ఏ మేరకు పడింది.. కార్మికుల బతుకులు ఎంత దుర్భరంగా మారాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. చేనేత రంగాన్ని ఎలా ఆదుకోవాలనే అంశంపై 'ప్రతిధ్వని' చర్చ..!