Prathidwani: దేశంలోని భిన్నమతాల మధ్య ఉన్న సామరస్యం.. కాపాడుకోవడం ఎలా? - ప్రతిధ్వని తాజా వార్తలు
PRATHIDWANI: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ దేశమైన భారత్.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. పరమత సహనం, లౌకికవాదం, భావప్రకటన స్వేచ్ఛ ఈ దేశం సాధించిన చారిత్రక సుగుణాలు. కానీ కొంతకాలంగా మతవాదులు, కొంతమంది రాజకీయ నేతల అసహనం హద్దులు మీరుతోంది. ఇలా కట్టుతప్పిన నేతల దురుసు వ్యాఖ్యల ఫలితంగా భారత్ నేడు ఇస్లామిక్ దేశాల విమర్శలను ఎదుర్కొంటోంది. కువైట్‌లో కొన్నిచోట్ల భారత ఉత్పత్తులను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. ఓఐసీ దేశాల్లోని భారత రాయబారులకు అసంతృప్తి లేఖలు అందుతున్నాయి. కొంతమంది వ్యక్తుల విపరీత ధోరణి కారణంగా అంతర్జాతీయంగా ఈ దేశ ప్రతిష్ఠకు భగం కలుగుతున్న దుస్థితికి కారణం ఏంటి? మతాల మధ్య విద్వేషాలు రాజేస్తున్న వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మన దేశంలో భిన్నమతాల ప్రజల మధ్య ఉన్న సామరస్యం చెడిపోకుండా కాపాడుకోవడం ఎలా? అనే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.