PRATHIDHWANI: వ్యాక్సిన్ల పరిశోధన, స్వయం సమృద్ధిలో దేశం సాధిస్తున్న ప్రగతి ఏంటి ? - ETV BHARAT PRATHIDHWANI DISCUSSION ON COVID VACCINATION
TS PRATHIDHWANI: కరోనా విపత్తుపై పోరాటంలో భారతదేశం మరో మైలురాయిని దాటేసింది. కొవిడ్-19 వైరస్ నుంచి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభత్వం 200 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసింది. దీంతో దేశంలో ప్రజారోగ్య భద్రతకు గట్టి భరోసా లభించినట్లైంది. ఊహించని రీతిలో ప్రపంచంపై విరుచుకుపడ్డ కరోనా దాడిని ఎదుర్కోవడంలో భారత ఫార్మా రంగం క్రియాశీలంగా వ్యవహరించింది. స్వదీశీ అవసరాలను తీరుస్తూనే.. ప్రపంచ దేశాలకు పెద్దఎత్తున టీకాలు ఎగుమతి చేయడంలో చురుకైన పాత్ర పోషించాయి మన బయోటెక్ కంపెనీలు. విపత్కర పరిస్థితులను అధిగమించి విజయం దిశగా అడుగేశాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల పరిశోధన, స్వయం సమృద్ధిలో దేశం సాధిస్తున్న ప్రగతి ఏంటి? రానున్న రోజుల్లో వ్యాధుల నియంత్రణలో టీకాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.