PRATIDHWANI: 'రూపాంతరం చెందుతున్న కరోనా.. కలవరపెడుతున్న కొత్త వేరియంట్లు' - కరోనా కొత్త వేరియంట్లు
కరోనా వైరస్ క్షణక్షణానికి రూపం మార్చుకుంటూ కొరకరాని కొయ్యగా తయారవుతోంది. ప్రాంతానికో తీరులో, దేశానికో రూపంలో వేలాదిగా ఉత్పరివర్తనం చెందుతూ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే అల్ఫా, బీటా, డెల్టా, టీటా, గామా, లామ్డా వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఈ జాబితాలో ఇప్పుడు సీ.1.2 చేరింది. ఇప్పటికే రెండు వేవ్‌ల్లో తీవ్రంగా నష్టపోయిన దేశం మూడో వేవ్ హెచ్చరికలను గమనిస్తూ ముందుకు సాగుతోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన వైరస్ వేరియంట్ మరింత తీవ్రంగా ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు వైరస్ వేరియంట్లు ఏ పరిస్థితుల్లో ఉద్ధృతం అవుతాయి? వాటికి అడ్డుకట్ట వేయడంలో వ్యాక్సిన్ల పాత్ర ఎంత? వైరస్ ప్రభావం నుంచి సురక్షితంగా బయటపడడం ఎలా? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.