కేరళ బాధితులకు 'ఈనాడు' తోడు.. చేకూరింది గూడు - కేరళలో ఈనాడు ఇళ్లు న్యూస్
కళ్ల ముందే కలల సౌధం కూలిపోతే..! చూస్తుండగానే... ఊరు ఊరంతా మునిగిపోతే..! ఆశ్రయం కోల్పోయి... తల దాచుకునేందుకు ఓ చోటు కూడా దొరకకపోతే..! ఆ బాధ వర్ణించటానికి భాష సరిపోదు. కేరళలో ఇదే జరిగింది. ఈనాడు వేసిన ఒక్క అడుగుతో లక్షలమంది దాతలు ముందుకొచ్చారు. రామోజీ సంస్థల సహకారంతో కేరళలో దాదాపు 121 ఇళ్లు కట్టించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులందరూ తమకు నీడనిచ్చి కాపాడిని రామోజీ సంస్థలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.