వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై చర్చ
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. అన్నదాతలు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి కమిటీ నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా... రైతు సంఘాలు అంగీకరించలేదు. చర్చల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆందోళన విరమించేందుకు ఒప్పుకోలేదు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబట్టాయి. అయితే చట్టాల్లో ఉన్న ప్రతి నిబంధనపై రైతులకు వివరించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.