తిరుపతిలో కరోనా వ్యాప్తిపై వినూత్న ప్రచారం - తిరుమతిలో కరోనా వ్యాప్తి నివారణకు వినూత్న ప్రచారం
కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేలా తిరుపతిలో వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద భాజపా నేత గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో రాయలసీమ రంగ స్థలి నాటక మండలి కళాకారులు యమధర్మరాజు, యమభటులు వేషధారణలో...బాధ్యతారాహిత్యంగా రహదారులపై వచ్చే వారిని ఆపి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. లాక్ డౌన్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా సహకరించి...స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని కోరారు.
Last Updated : Apr 12, 2020, 2:56 PM IST