కరోనాపై గళం : ఇల్లు దాటవద్దు... అదే మనకు హద్దు.... - Chandraiah Corona Song
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజానాట్యమండలి కళాకారులు చంద్రయ్య కరోనా వైరస్‌పై స్వయంగా పాట రాసి పాడారు. ప్రజలు ఎవరూ ఇళ్లు దాటకుండా వైద్యులు సూచించిన సలహాలు పాటించి, కరోనా మహమ్మారిని తరిమి కొడదామంటూ ఆయన గళం విప్పారు. బయటకు రాకుండా, మూఢనమ్మకాలను నమ్మకుండా, భయభ్రాంతులకు గురి చేసే వారి మాటలు నమ్మకుండా కనీస జాగ్రత్తలు తీసుకుని కరోనాని అంతం చెయ్యవచ్చంటూ తన పాట ద్వారా అవగాహన కల్పించారు.