గుడివాడలో మహా శివరాత్రి వేడుక.. ముఖ్యమంత్రి జగన్ పూజలు - సీ
కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మహా శివరాత్రి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ముఖ్యమంత్రి జగన్.. పరమశివుడి లింగానికి అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు నిర్వహించిన యాగంలో భాగంగా.. పూర్ణాహుతిలో సీఎం పాల్గొన్నారు. ఈ వేడుకకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.