100వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల దీక్షలు - amaravathi farmers latest news
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 100 రోజుకు చేరుకున్నాయి. దీక్షలో భాగంగా రైతులు, మహిళలు అమరావతి వెలుగు పేరుతో కాగడాలతో నిరసన తెలిపారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాక, తుళ్లూరులో రైతులు తమ ఇళ్ల వద్దే ఆందోళన చేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ రైతులు నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దూ... ఒకే రాజధాని ముద్దూ అంటూ నినదించారు.