లాక్డౌన్లో ప్రకృతిని మిస్సవుతున్నారా...చూసేయండి ఇలా..!
ఎటూ చూసిన ఆహ్లాదాన్ని పంచే పచ్చని మడ అడవులు...ముగ్ధమనోహరమైన సూర్యోదయ, సూర్యాస్తమయాలు...సముద్ర అలల సవ్వడులు...నదిలో చేపల సయ్యాటలు... ఆకురాల్చి కొత్త చిగురులు తొడిగిన పచ్చని చెట్లు...పాల నురుగలాంటి తెల్లని మేఘాలు..కాలుష్య రహిత రోడ్లు..ఆకాశంలో పక్షుల విహారాలు....ఇవీ లాక్డౌన్ కారణంగా కృష్ణా జిల్లా దివిసీమలో కనిపిస్తున్న అద్భుత దృశ్యాలు. కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో అయితే పక్షుల ఆనందాలకు అవధులు లేకుండా పోయింది. గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి గంతులేస్తున్న పక్షులు, బుడి బుడి నడకల తాబేళ్లు...సముద్ర ఒడ్డున ఎర్ర తివాచి పరచినట్లుగా ఎర్రటి పీతలు... ఒక్కటేమిటి అక్కడి సౌందర్యం ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.